బాలయ్య డైరెక్షన్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే బాలకృష్ణ మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. నిన్న బాలయ్య 61వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. మరోసారి తన కొడుకు ఎంట్రీ గురించి పాజిటివ్గానే మాట్లాడాడు బాలయ్య.

మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ గురించి బాలయ్య ఈసారి ఆసక్తికర కబురు చెప్పారు. ఎప్పట్నుంచో నానుతున్న ‘ఆదిత్య 369’ సీక్వెల్తో మోక్షజ్ఞ తెరంగేట్రం చేయబోతున్నట్లు బాలయ్య వెల్లడించడం విశేషం. అంతే కాదు.. ఈ సినిమాను తనే డైరెక్ట్ చేయనున్నట్లు కూడా చెప్పాడు. ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది మాత్రం బాలయ్య వెల్లడించలేదు. ఈ సినిమాకు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్టు కూడా పూర్తి చేశారు. దానికి స్టోరీ బోర్డ్ సైతం రెడీ చేశారు. ఐతే ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇప్పుడు సింగీతం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే స్థితిలో లేకపోవచ్చు. బహుశా స్క్రిప్టు స్టోరీ బోర్డ్ రెడీగా ఉంది కాబట్టి తనే డైరెక్ట్ చేద్దామని బాలయ్య అనుకుంటున్నాడేమో. ఇందులో బాలయ్య మోక్షజ్ఞ తండ్రీ కొడుకులుగా కనిపించే అవకాశముంది.

CLICK HERE!! For the aha Latest Updates