‘మహా సముద్రం’ నుంచి అదితి రావు ఫస్ట్‌లుక్‌


అజయ్ భూపతి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్ – ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి, గార్జియస్ అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘మహాసముద్రం’ సినిమాలో ‘మహా’ పాత్రలో అదితి నటిస్తోంది. ఈ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ భారీ మల్టీస్టారర్ ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 19న విడుదల చేయనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates