HomeTelugu Trendingనగ్నంగా నటించిన ఆండ్రియా!

నగ్నంగా నటించిన ఆండ్రియా!

Heroine andrea act nude in

కోలీవుడ్‌లో సింగర్‌, హీరోయిన్‌గా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా. ఆమె తాజాగా ఓ సినిమా కోసం నగ్నంగా కెమెరా ముందుకొచ్చిందట. 2016లో మిష్కిన్ డైరెక్షన్‌ లో విడుదలైన ‘పిశాసు’ మూవీకి సీక్వల్‌గా‌ ‘పిశాసు-2’ రాబోతోంది. కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమాలో ఓ సీన్ కోసం ఆండ్రియా నగ్నంగా నటించినట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం కొందరి సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై కోలీవుడ్‌లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

ఈ చిత్రంలో పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణిలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకప్పుడు బెడ్రూం సీన్ చేసి తప్పు చేశానని వాపోయిన ఈ హాట్‌ బ్యూటీ మళ్లీ నగ్నంగా నటించటానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu