‘నో ఎంట్రీ’ ట్రైలర్‌

కోలీవుడ్‌లోని మల్టీటాలెంటెడ్‌ హీరోయిన్స్‌లో ఆండ్రియా జెరెమియా ఒక‌రు. సస్పెన్స్ థ్రిల్లర్ .. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను చేయడానికి ఆమె ఆసక్తిని చూపుతుంది. ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్‌లో యుగానికి ఒక్కడు, తాడాఖా సినిమాలో కనిపించింది. తాజాగా తమిళంలో ఆమె చేసిన ఒక సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకులను ముందుకు రానుంది. అటవీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘నో ఎంట్రీ’.

శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకి అలుగు కార్తీక్ దర్శకత్వం వహించాడు. అజేశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ విడుదలైంది. ఇది ఫారెస్టు నేపథ్యంలో .. అడవి కుక్కలకి సంబంధించిన కథ అనే విషయం ఈ ట్రైలర్ వలన అర్థమవుతోంది.

“ఒక సైంటిస్ట్ అడవి కుక్కలపై రీసెర్చ్ చేస్తాడు .. అవి కరిచిన కొద్ది సేపటికే మనుషులకు వాటి లక్షణాలు వస్తుంటాయి. ఆ ఫారెస్టుకి వెళ్లిన సైంటిస్ట్ అదృశ్యం కావడంతో, అతని ఆచూకీ తెలుసుకోవడం కోసం అతని కూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళుతుంది. అక్కడ చిక్కుబడిన ఆ టీమ్ ఎలా బయటపడిందనేదే కథ. త్వ‌ర‌లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల‌కానుంది.

‘విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌’ రివ్యూ

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates