మెగాస్టార్ చిన్నల్లుడికి సైబర్ వేధింపులు

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్‌కు ఇంస్టాగ్రామ్ లో వేధింపులు మొదలయ్యాయి. కొంతమంది పోకిరీలు ఇంస్టాగ్రామ్ లో ఆయన్ను వేధిస్తున్నారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అసభ్యకరమైన మాటలతో వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. హీరో కళ్యాణ్ దేవ్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కళ్యాణ్ దేవ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీలు, ఆ వ్యక్తులను గుర్తించారు. ఆ వ్యక్తులు ఎవరు, వాటి డీటెయిల్స్ ఏంటి అనే వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.