HomeTelugu Trendingతిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని

Hi nanna team visits Tiruma
నేచురల్‌ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. నాని 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో మృణాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండ‌గా.. మలయాళ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 7న థియేటర్స్‌లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

ఈ క్రమంలో ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సోమవారం తిరుప‌తి ‘హాయ్‌ నాన్న’ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Image

అంత‌కుముందు ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆదివారం కడప వెళ్లిన నాని అక్క‌డ‌ ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!