HomeTelugu Newsహైఅలర్ట్ : ఏపీలో కరోనా నివారణ చట్టం అమలు

హైఅలర్ట్ : ఏపీలో కరోనా నివారణ చట్టం అమలు

8 14
దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో ప్రధాన రాష్ట్రాలు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించాయి. ముంబై మొదలు అనేక నగరాలు నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. ఇప్పటికే ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం అనేక మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది.

ఇక తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ రాష్ట్రం హైఅలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా.. తెలంగాణలో స్కూల్స్, సినిమా హాల్స్, మాల్స్ అన్నింటిని మూసివేయ్యాలని ఆదేశాలు జారే చేసింది. ఇదే బాటలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నడుస్తున్నది. ఏపీలో ఇప్పటి వరకు ఒక పాజిటివ్ కేసు నమోదైంది. మరికొంతమంది అనుమానితులకు సంబంధించి రిపోర్ట్స్ రావాల్సి ఉన్నది. దీంతో ఏపీ కరోనా నివారణ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అటు తిరుమలలో కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. తిరుమలలో అనేక ప్రత్యేక పూజలను నిలిపివేశారు. అదేవిధంగా క్యూ కాంప్లెక్స్ లలో భక్తులు నిలబడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గంటకు 4వేలమందికి మాత్రమే దర్శనానికి అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu