ప్రభాస్‌తో సమంత!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో, జిల్’ సినిమాలు చేస్తున్నారు. మొదటి సినిమా ఆగష్టు 15 వ తేదీన విడుదల కాబోతున్నది. దీని తరువాత ‘జిల్’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చిత్రబృందం. ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

ప్రభాస్ సినిమా కోసం దిల్ రాజు దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారట. ప్రభాస్… దిల్ రాజు సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకుంటున్నారని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో సమంత మూడు సినిమాలు చేయాల్సి ఉంది. అందులో ఒకటి తమిళ్ రీమేక్ 96 సినిమా కాగా, రెండో సినిమా ప్రభాస్ తో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రభాస్.. సమంత సినిమా ఒకే అయితే.. వీరి కాంబినేషన్లో రాబోతున్న తొలి సినిమా ఇదే అవుతుంది.

CLICK HERE!! For the aha Latest Updates