HomeTelugu Trendingవిశ్వక్‌సేన్‌ 'హిట్‌' మూవీ .. ప్రోమో రిలీజ్

విశ్వక్‌సేన్‌ ‘హిట్‌’ మూవీ .. ప్రోమో రిలీజ్

5 10

‘నేచురల్‌ స్టార్‌’ నాని సమర్పణలో ‘వాల్‌ పోస్టర్‌ సినిమా’ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా’ హిట్‌’. ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ ఓ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వం ఈ చిత్రానికి ‘హిట్‌’ అనే పేరును టైటిల్‌గా ప్రకటించగానే అసలు దాని వెనుక అర్థం కోసం చాలా మంది వెతికారు. తాజాగా ‘HIT’ అంటే ఏంటో చెబుతూ ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది మూవీ యూనిట్‌.

ఓ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తూ విశ్వక్‌సేన్‌ అందులో కనిపించారు. కేసు పూర్తి వివరాలను ‘HIT’లో పెట్టనున్నట్లు తెలపగా, ”సర్‌ ‘HIT’ అంటే ఏంటి” అని విలేకరి ప్రశ్నించడంతో ‘HIT’.. హోమ్‌ సైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌ అని దాని వెనుక ఉన్న అర్థాన్ని చెప్పారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu