హాలీవుడ్ రీమేక్ లో విక్రమ్..?

విలక్షణ నటుడు విక్రమ్ త్వరలోనే ఓ హాలీవుడ్ సినిమా రీమేక్ లో నటించబోతున్నాడనే వార్తలు
వినిపిస్తున్నాయి. ఇంకొక్కడు సినిమా హిట్ తో ఎంజాయ్ చేస్తోన్న విక్రమ్ తదుపరి సినిమా ఇదే
అయి ఉండొచ్చని టాక్. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల హాలీవుడ్ లో విడుదలయిన సస్పెన్స్
త్రిల్లర్ ‘డోంట్ బ్రీత్’ చిత్రాన్ని ఇండియన్ వెర్షన్ లో చేయడానికి కోలీవుడ్ దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
ఈ సినిమాలో స్టీఫెన్ లాంగ్ పోషించిన పాత్రలో విక్రమ్ సరిగ్గా సూట్ అవుతాడని భావించి ఆయనను
సంప్రదిస్తున్నారు. అలానే రీమేక్ రైట్స్ కోసం హాలీవుడ్ మేకర్స్ ను సంప్రదిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా
జరిగితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. విక్రమ్ కూడా ఈ రీమేక్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు
తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates