HomeTelugu Trendingవరుణ్‌ తేజ్‌ 'గని' కోసం హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్‌

వరుణ్‌ తేజ్‌ ‘గని’ కోసం హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్‌

Hollywood stunt choreograph

మెగా హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ ఓ బాక్సింగ్‌ క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అదేంటంటే.. సినిమాలో కీలకమైన బాక్సింగ్‌ ఎపిసోడ్‌ కోసం ప్రముఖ హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్‌ వ్లాడ్‌ రింబర్‌ పనిచేయనున్నారట. ఆ ఫైట్‌ సన్నివేశాన్ని భారీ స్టేడియంలో చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ సయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. జగపతిబాబు, నవీన్‌ చంద్ర, సునీల్‌శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తుండగా, రెనైసెన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌ ప్రముఖ బాక్సర్‌ టోనీ జెఫ్రీస్‌ దగ్గర ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్న విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!