HomeTelugu NewsHorror Entertainer "SivaGami" Press Meet

Horror Entertainer “SivaGami” Press Meet

“శివగామి” సూపర హిట్టవ్వడం ఖాయం”
“శివగామి” ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో అతిధుల ఆకాంక్ష 
 
కన్నడలో ఘన విజయం సాధించిన “నాని” అనే హారర్ చిత్రం తెలుగులో “శివగామి”గా ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ..  భీమవరం టాకీస్ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబి సుహాసిని, జై జగదీశ్, కల్పన, రాధ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సుహాసినీమణిరత్నం ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. త్యాగరాజ్-గురుకిరణ్  సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో విశేష ఆదరణ పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని.. “శివగామి” ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు.  
ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివాజీరాజా,  ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ పి.సత్యారెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కోశాధికారి కొడాలి వెంకటేశ్వరావు,  ప్రముఖ దర్శకులు శివ నాగేశ్వరావు, గజల్ శ్రీనివాస్, ప్రముఖ నిర్మాతలు కె.వి.వి.సత్యరాయణ, జీవి.చౌదరి, నాగరాజు గౌడ్ చిర్రా,  జూలకంటి మధుసూదన్ రెడ్డి, సంతోషం సురేష్, అఖిల భారత ఆర్య వైశ్య మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి నల్లమిల్లి రాధ, ఎన్నారైలు  సతీష్ రెడ్డి పున్నం, కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు “శివగామి” చిత్రానికి మాటలు, పాటలు రాసిన భారతిబాబు, ఈ చిత్రంలో ఓ గీతాన్ని ఆలపించిన కుమారి సంస్కృతీ, చిత్ర సమర్పకులు రమేష్ కుమార్ జైన్, దర్శకులు సుమంత్, కెమెరామెన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. 
SivaGami Horror
“శివగామి” ట్రైలర్స్ లో సక్సెస్ కళ కనబడుతోందని, కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమని,  “శివగామి” విడుదల తర్వాత.. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ పేరు “శివగామి సత్యనారాయణ”గా మారిపోతుందని వక్తలు ఆకాక్షించారు. 
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. “నెల రోజుల క్రితం కన్నడలో విడుదలై అఖండ విజయం సాధించి.. ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో నడుస్తున్న  ఈ చిత్రం తెలుగులోనూ ఖఛ్చితంగా ఘన  విజయం సాధిస్తుంది. ఆంద్ర, తెలంగాణాల్లో అత్యధిక ధియేటర్స్ లో ఈ చిత్రాన్ని ఈనెల 5న  విడుదల చేస్తున్నాం” అన్నారు. 
అనంతరం సి.కళ్యాణ్, శివాజీరాజా చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు ప్లాటినం డిస్క్ షీల్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా.. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సి,కళ్యాణ్, ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ గా నియమితులైన సత్యారెడ్డిలను రామ సత్యనారాయణ ఘనంగా సత్కరించారు.    
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సురేష్, సంగీతం: త్యాగరాజ్-గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా. శివ వై. ప్రసాద్, సమర్పణ: రమేష్ కుమార్ జైన్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుమంత్

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!