Homeపొలిటికల్ఆనం రామనారాయణ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో 'ఆనం' పరిస్థితేంటి ?

ఆనం రామనారాయణ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ‘ఆనం’ పరిస్థితేంటి ?

How is Anam Ramanarayana Reddys graph

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆనం బ్రదర్స్ అంటే తెలియని వారు లేరు. వారిలో ఒకరైన ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు. వైసీపీలో ఉంటూనే జగన్ రెడ్డికి వ్యతిరేకంగా గొంతు ఎత్తిన నాయకుడు ఆయన. జగన్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నరగా తన ఫోన్ ట్యాప్ చేస్తోందంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి తన కుటుంబ సభ్యులతో కూడా వాట్సాప్ కాల్స్ చేయాల్సి వస్తోందంటూ ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. తన భద్రతను కూడా తగ్గించారని, ఇలాంటి పోకడలు గతంలో ఎన్నడూ చూడలేదంటూ ఆనం వివరణ ఇచ్చారు. మొత్తానికి వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయిస్తున్నాయంటూ, ఇది అసలు సరైన పద్ధతి కాదంటూ జగన్ రెడ్డికి హితవు పలికారు. పైగా జగన్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని.. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాల్సి ఉందని ఆనం చెప్పుకొచ్చాడు. మొత్తమ్మీద జగన్ రెడ్డి పై నెగిటివ్ కామెంట్స్ చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే అన్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

మరి ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితేంటి ? , వచ్చే ఎన్నికల్లో ఆనం రామానారాయణ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఆనం రామనారాయణ రెడ్డి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని నెల్లూరు నగరంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నెల్లూరు వి. ఆర్. కళాశాలలో బీకాం మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో బి.ఎల్ పూర్తి చేశారు. ఆనం కుటుంబం తొలి నుంచి రాజకీయ కుటుంబమే. సుమారు 85 ఏళ్లుగా వారి కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుంది. రామనారాయణరెడ్డి పెదనాన్న ఏ.సి. సుబ్బారెడ్డి ఉమ్మడి మద్రాస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా ఉండేవారు. తండ్రి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి, సోదరులు ఆనం సంజీవ రెడ్డి మాజీ మంత్రి, ఆనం వివేకానంద రెడ్డి ఎమ్మెల్యే గా ఉంటూనే ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించారు. ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తండ్రి వెంకట్ రెడ్డి, సోదరుడు వివేకానంద రెడ్డి లతో కలిసి ఆ పార్టీలో చేరారు. 1983లో నెల్లూరు సిటీ నుండి, 1985లో రాపూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1994లో రాపూరు నుంచి ఓటమి పాలయ్యారు. 1999, 2004 లలో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టిడిపి లో చేరారు. కానీ 2019 ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. 2019 లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆరోసారి విజయం సాధించారు. ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ ఎదుగుదలకు తోడ్పడింది తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ మరియు ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుడిగా, అజాత శత్రువుగా నిలిచిన ఆనం రామనారాయణరెడ్డి నేడు వైసీపీ అధినేత జగన్ రెడ్డి పై యుద్ధానికి దిగారు.

ఆనం రామనారాయణరెడ్డికి ఇవ్వాల్సిన స్థాయిలో జగన్ రెడ్డి గౌరవం అలాగే పదవి ఇవ్వలేదు అనేది నిజం. అందుకే.. జగన్ రెడ్డి పై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆనం రామనారాయణరెడ్డి జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ గానే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్ రెడ్డి వ్యతిరేఖత పెరుగుతుందని ఆనం రామనారాయణరెడ్డికి అర్ధం అయ్యింది. వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే.. జగన్ రెడ్డి పార్టీ నుంచి ఆనం నిర్ణయించుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి గ్రాఫ్ కూడా బాగానే ఉంది. టీడీపీ పార్టీ నుంచి ఆనం పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంది. అందుకే.. ఆనం ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధం అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu