HomeTelugu Trendingచిన్నారి డ్యాన్స్‌కు హృతిక్‌ ఫిదా.. వైరల్‌

చిన్నారి డ్యాన్స్‌కు హృతిక్‌ ఫిదా.. వైరల్‌

5 11బాలీవుడ్‌ హీరో హృతిక్‌ ను డ్యాన్స్‌ పరంగా స్ఫూర్తిగా తీసుకుని నృత్యం నేర్చుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కూడా ఇదే కోవకు చెందిన అభిమానే. అలాంటి హృతిక్‌ను ఓ చిన్నారి ఫిదా చేసింది. స్టెప్పులు ఇరగదీసి.. శభాష్‌ అనిపించుకుంది. గీత్‌ అనే బాలిక హృతిక్‌ నటించిన ‘వార్‌’ సినిమాలోని ‘జై జై శివ్‌ శంకర్‌..’ పాటకు డ్యాన్స్‌ చేసింది. దీన్ని అభిమానుల ఖాతా ద్వారా చూసిన హృతిక్‌ స్పందించారు. పాప డ్యాన్స్‌ వీడియోను రీట్వీట్‌ చేస్తూ.. ‘వాట్‌ ఎ స్టార్‌.. లవ్‌యు’ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం గీత్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి ఏ మాత్రం తడబడకుండా అవలీలగా డ్యాన్స్‌ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. దాదాపు 1.26 లక్షల మందికిపైగా వీడియోను వీక్షించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu