HomeTelugu Trendingమేజర్‌: 'హృదయమా' సాంగ్‌ విడుదల

మేజర్‌: ‘హృదయమా’ సాంగ్‌ విడుదల

Hrudayama Lyrical song from

టాలీవుడ్ హీరో అడివి శేష్ నటించిన చిత్రం ‘మేజర్’. ఈ మూవీ విడుదల గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శశి కిరణ్ తిక్క డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం నుండి ఫస్ట్‌ సాంగ్‌ ఈరోజు విడుదలైంది. ‘హృదయమా’ అనే సాంగ్ ను ఈరోజు మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ శ్రావ్యమైన సాంగ్ చాలా రొమాంటిక్ గా, ఉల్లాసంగా ఉంది. లిరికల్ వీడియో సినిమాలోని ప్రేమికుల మధ్య సుదూర సంబంధాన్ని సూచిస్తోంది. ఈ పాట చాలా ఆకర్షణీయంగా ఉంది. రొమాంటిక్ సాంగ్స్ ఇష్టపడే వారి ప్లేలిస్ట్‌ లో ఈ సాంగ్ టాప్ లో ఉంటుంది. ఈ రొమాంటిక్ సాంగ్ కు కృష్ణ కాంత్, విఎన్వి రమేష్ కుమార్ లిరిక్స్ అందించారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇక దుల్కర్ సల్మాన్ విడుదల చేసిన మలయాళం వెర్షన్ ‘పొన్ మలారే’ పాటకు కూడా సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోంది. మలయాళంలో ఐరాన్ ఈ పాటను పాడారు. ‘మేజర్’లో సాయి మంజ్రేకర్, శోబితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu