HomeTelugu Trendingదిల్‌ రాజు మేనల్లుడితో అనుపమా రొమాన్స్‌..

దిల్‌ రాజు మేనల్లుడితో అనుపమా రొమాన్స్‌..

8 11
టాలీవుడ్‌లో అనుపమా పరమేశ్వరన్.. ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఒక వైపున తెలుగులో తనకి నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే, మరో వైపున తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలను కవర్ చేస్తోంది.

తాజాగా ఆమె తెలుగులో మరో సినిమాను అంగీకరించింది. ‘దిల్’ రాజు తన మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమౌతున్నాడు. ఈ సినిమాకి ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. హీరోయిన్‌ పాత్రకు అనుపమ అయితేనే పూర్తి న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం అనుపమకి భారీ పారితోషికమే ముడుతున్నట్టు వినికిడి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu