HomeTelugu Trendingవిడుదలైన రెండు వారాలకే ఓటీటీకి 'హంట్‌'!

విడుదలైన రెండు వారాలకే ఓటీటీకి ‘హంట్‌’!

hunt movie ott release date
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘హంట్’‌. గన్స్‌ డోంట్‌ లై అనేది క్యాప్షన్‌. శ్రీకాంత్‌, ప్రేమిస్తే ఫేమ్‌ భరత్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. మహేశ్‌ దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చింది. దీంతో బాక్సాఫీసు దగ్గర సినిమా బోల్తా కొట్టింది. దీంతో విడుదలైన రెండు వారాల్లోనే ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఎలాంటి ప్రమోషన్‌.. ముందస్తు హడావుడి లేకుండానే హంట్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అది కూడా కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. రేపట్నుంచి ( ఫిబ్రవరి 10 ) ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అధికారికంగా ప్రకటించాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!