కౌశల్‌ ఆర్మీ డబ్బులు ఇస్తుంది.. వైరల్‌ వీడియో..!

తెలుగు ‘బిగ్ బాస్-2’ నిన్నటి ఎపిసోడ్‌తో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక షో క్లైమాక్స్ కు ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది. నిన్నటి ఎపిసోడ్‌ కౌశల్‌ కు మిగతా ఇంటి సభ్యులకు మధ్య పెద్ద ఎత్తునే గొడవలు జరిగాయి. కాగా ఇప్పటికే హైదరాబాద్ లో కౌశల్ ఆర్మీ పేరుతో 2కె రన్ చేసిన ఫాన్స్ తాజాగా విజయవాడలో అలాంటి హంగామానే చేసారు. కాకపోతే తాజాగా ఫేస్ బుక్ లో వైరల్ అవుతున్న ఒక వీడియో కౌశల్‌ ఆర్మీ పరువును నిలువునా తీసేలా ఉంది.

విజయవాడలో జరిగిన ఈ రన్ లో ఓ యువకుడిని ఎందుకు ఈ ర్యాలీలో పాల్గొంటున్నావని ప్రశ్నించగా బయలుదేరేటప్పుడు 200 రూపాయల పెట్రోల్ తిరిగి వచ్చేటప్పుడు మరో 200 రూపాయల పెట్రోల్ కొట్టించడంతో పాటు సాయంత్రం పార్టీ ఇస్తామని చెప్పారని అందుకే వచ్చానని చెప్పడం అందులో ఉంది. ఇది అడుగుతున్నప్పుడు రహస్యంగా కెమెరాతో షూట్ చేస్తున్న విషయం తెలియకపోవడంతో ఆ యువకుడు నిజం చెప్పేసాడు. ఆ సమయంలో అతని ఒంటి మీద కౌశల్ ఫోటోతో సదరు ఆర్మీ లోగో కూడా ఉండటం విశేషం.

ఇప్పుడు ఈ వీడియోను సాక్ష్యంగా చూపిస్తూ కౌశల్ ఆర్మీ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు ఈ షోని వ్యతిరేకిస్తున్న వర్గం. ముందు నుంచి ఇది స్క్రిప్టెడ్ షో అని చెబుతున్నా అమాయకులైన కొందరు అభిమానులకు అర్థం కావడం లేదని అందుకే వీటిని చూపించాల్సి వస్తోందని అంటున్నారు. గత శనివారం గీతా మాధురి సైతం బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ ని ప్రమోట్ చేయటం కోసం బయట ఏజెన్సీలు ఉన్నాయని తనకు తెలుసు అని ఫోన్ కూడా చేసారని చెప్పడం నానిని సైతం ఇరకాటంలో పడేసింది.
అసలు బయట జరుగుతున్నదంతా బిగ్ బాస్ షో నిర్వాహకుల ఆద్శర్యంలో ఉందన్న కామెంట్ కూడా ముందు నుంచి ప్రచారంలో ఉన్నాయి.