HomeTelugu Big Stories'భోళా శంకర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆది స్పీచ్‌ వైరల్‌

‘భోళా శంకర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆది స్పీచ్‌ వైరల్‌

hyper aadi speech in

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిన్న రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో హైపర్‌ ఆది స్పీచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దాదాపు పావుగంట సమయం తీసుకుని మెగా ఫ్యామిలీ గురించి, రామ్‌ చరణ్‌ గురించి, పవన్‌ కళ్యాణ్‌ గురించి ఇలా మెగా స్పీచ్‌ ఇచ్చాడు. చిరంజీవి సైతం ఆది స్పీచ్‌కు కళ్లు చెమ్మగిల్చాడంటే ఏ స్థాయిలో హైపర్‌ ఆది మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చు. పక్కనే కూర్చున్న అల్లు అరవింద్‌ ఆశ్చర్యపోతూ స్పీచ్‌ వినడం మరో హైలేట్‌.

చిరంజీవి కెరీర్‌ బిగెనింగ్‌ స్ట్రగుల్స్‌ నుంచి వాల్తేరు వీరయ్య సక్సెస్‌ వరకు ప్రతీ విషయాన్ని చెప్పాడు. చిరంజీవిపై విమర్శలు చేసే వారికి కౌంటర్‌ ఇస్తూ రెచ్చిపోయాడు. అన్నయ్య మంచోడు కాబట్టి ముంచారు. తమ్ముడు మొండొడు ముంచడాలు ఉండవు, తాడో పోడో తెంచడాలే అంటూ మాస్‌ లెవల్లో ఎలివేషన్‌ ఇచ్చాడు. చిరుత సినిమాలో చరణ్‌పై విమర్శలు చేసిన వారే రంగస్థలంలో ఆయన నటనను చూసి చప్పట్లు కొట్టారని చెప్పాడు. టెండుల్కర్‌ కొడుకు టెండుల్కర్‌ కాలేడు. అమితాబ్‌ కొడుకు అమితాబ్‌ కాలేడు. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. చిరంజీవిని మించి పోయాడంటూ చరణ్‌పై ఇచ్చిన ఎలివేషన్‌కు ఆడిటోరియం మొత్తం ఊగిపోయింది.

మొత్తంగా ఒక పావు గంట పాటు హైపర్‌ ఆది మెగా అభిమానుల్లో తిరుగులేని జోష్‌ నింపాడు. దెబ్బకు గత రాత్రి నుంచి ట్విట్టర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ చూసిన ఆది స్పీచ్‌ గురించే చర్చలు జరుగుతున్నాయి. మొత్తగానికి మెగా ఫ్యామిలీపై తనకున్న అభిమానాన్ని స్పీచ్‌ రూపంలో చెప్పి మెగా అభిమానుల మనసు గెలుచుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!