HomeTelugu Big Stories'పుష్పక విమానం' నుండి కళ్యాణం లిరికల్‌ సాంగ్‌ వచ్చేసింది

‘పుష్పక విమానం’ నుండి కళ్యాణం లిరికల్‌ సాంగ్‌ వచ్చేసింది

Kalyanam Lyrical Song from

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. కొత్త దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఆనంద్ గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ‘కళ్యాణం’ అనే లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేస్తూ.. చిత్ర బృందానికి విషెస్ అందించారు.

ఈ పాటకు సంగీత దర్శకుడు రామ్ మిరియాల మంచి బాణీలు సమకూర్చారు. ఈ పెళ్లి పాటను మంగ్లీ – సిధ్ శ్రీరామ్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ ఈ గీతానికి అద్భుతమైన సాహిత్యం అందించారు. ఇప్పటికే విడదులైన సిలాకా పాటకు మంచి స్పందన వచ్చింది. శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్, అజయ్, సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోవర్ధన్ రావు దేవరకొండ , విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu