నేను నా లిప్‌స్టిక్ కంటే బోల్డ్.. అనసూయ హాట్‌ ఫొటో

జబర్దస్త్ యాంకర్ అనసూయ హాట్‌ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ బుల్లితెరనే కాకుండా వెండితెరపై కూడా ఫిదా చేస్తుంది. ఒకవైపు జబర్దస్త్ కామెడీ షోతో హాట్ యాంకర్‌గా రాణిస్తూనే.. ‘క్షణం’, ‘యాత్ర’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆమె లీడ్‌రోల్‌లో నటిస్తున్న ‘కథనం’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అనసూయ.. ఎప్పటికప్పుడు తన షూటింగ్ అప్డేట్స్‌తో పాటు జబర్దస్త్ మేకోవర్ ఫొటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌కి టచ్‌లో ఉంటుంది. తాజాగా ఆమె కవ్వించే కళ్లతో అధరపు సోయగాలకు రంగులు అద్ది ఆ ఫొటోకు బోల్డ్ కామెంట్ జతచేసి సోషల్ మీడియాలో వదిలిపెట్టింది

పెదాలకు ముదురు వంగపూవు రంగు లిప్ స్టిక్ రాసి, బ్రింజెల్ కలర్ డ్రెస్ కాంబినేషన్‌లో కళ్ల నిండా మైకాన్ని కమ్ముకుని ఫొటోకు పోజులు ఇచ్చింది. ‘నేను నా లిప్‌స్టిక్ కంటే బోల్డ్.. నాకు తెలుసు ఇది మీరు నమ్ముతారని’ అంటూ హాట్ పిక్ బోల్డ్ కామెంట్ జత చేసింది.

CLICK HERE!! For the aha Latest Updates