ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను: కంగనా

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ .. ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలిచే కంగనా.. తొలిసారి తన వ్యక్తిగత విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘నేను ప్రేమలో లేని రోజంటూ లేదు. నా జీవితంలో ప్రేమ విషయంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నా. కానీ వాటి నుంచి వెంటనే బయటపడిపోయాను. ఇప్పుడు నా జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రస్తుతం నేను డేటింగ్‌ గురించి ఆలోచించడంలేదు. నాకు స్ఫూర్తిగా నిలిచే ఓ వ్యక్తి తోడు కావాలని కోరుకుంటున్నాను. 20 ఏళ్ల వయసులో నాకు రిలేషన్‌షిప్‌ పట్ల విభిన్నమైన అలోచనలు ఉండేవి. ఇప్పుడు నేను ఒకరి కోసం పాకులాడదలచుకోలేదు’ అని అన్నారు కంగన. కానీ ఆ వ్యక్తి గురించి మాత్రం ఎలాంటి వివరాలూ బయటపెట్టలేదు.

‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంతో మంచి విజయం అందుకున్న కంగన.. ప్రస్తుతం ‘మెంటల్‌ హై క్యా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్‌ రావు హీరోగా నటిస్తున్నారు.