HomeTelugu Trending'ఇచ్చట వాహనములు నిలుపరాదు' ట్రైలర్‌

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ట్రైలర్‌

Ichata vahanamulu niluparad
అక్కినేని సుశాంత్ హీరోగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ సినిమా ఆగస్టు 27న విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 2 నిమిషాల నిడివితో సాగిన ఈ ట్రైలర్ లో అన్ని ఎమోషన్స్ ను చూపించేశారు. నవరసాలతో పాటు సస్పెన్స్ కూడా క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో నటుడు వెంకట్ కీలక పాత్రలో కన్పించారు. ట్రైలర్ చివర్లో వచ్చే “సేల్ లో డిస్కౌంట్ బ్యాచ్ కాదు… హోల్ సేల్ గా లేపేసే బ్యాచ్” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ఎస్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఏఐ స్టూడియోస్ అండ్ శాస్త్రా మూవీస్ బ్యానర్‌ల కింద రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కొయ్యలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి చిత్రం. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu