HomeTelugu Big Storiesఇండస్ట్రీ లో ఇంటి దొంగలు

ఇండస్ట్రీ లో ఇంటి దొంగలు

“అన్నీ రడీగా ఉన్నాయ్‌రా.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఇంక మొదలెట్టడమే లేటు. ఒరేయ్ నీకిదే చెప్పడం, రెండు రౌండ్లయ్యాక నా లవరు ఆదిలక్ష్మి నన్ను వదిలెందుకెళ్ళిపోయింది అని ఎదవ నస పెట్టకూడదు సరేనా??” చెప్తున్నాడు ఏకాంబరం. కానీ కనకాంబరం మాత్రం వినకుండా ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
ఏకాంబరం : ఏంట్రా.. అంత భాధడిపోతున్నావ్?? కొంపతీసి ఇందాక “మోడీ స్పీచ్” గానీ విన్నావా??
కనకాంబరం : పోరా.. నీకెప్పుడు కామెడీయే..
ఏకాంబరం : మరి!! డబ్బులు దొరకని టైంలో కూడా జనం మందు కోసం లైన్లో నుంచుని 31st నైటు ఎంజాయి చేస్తుంటే, నువ్వేంట్రా అలా “బికామ్‌లో ఫిజిక్స్” చదివేవాడిలా కుర్చున్నావ్?
కనకాంబరం : ఇందాకే పేపర్‌లో న్యూస్ చదివాన్రా.. పాపం పదిహేనేళ్ళ పిల్లని 17 రోజుల పాటు హింసించేరంట్రా??
ఏకాంబరం : ఎవరిని, ఎక్కడ హింసించార్రా?
కనకాంబరం : ఒకమ్మాయి సినిమాల్లో డాన్సర్ అవ్వాలని బాగా నేర్చుకుని పాపం హైదరాబాద్ వెళ్ళిందంట. అక్కడ ఎవరో ఛాన్సులిప్పిస్తాం అని చెప్పి.. అయిదుగురు కలిసి లైంగిక దాడి చేసారంటరా..
ఏకాంబరం : ఆ అమ్మాయి వెళ్ళే ముందే జాగ్రత్తగా చూసుకోవాలి కదరా.
కనకాంబరం : అంటే ఆ అమ్మాయి సినిమాల్లో డాన్సు చేయలనుకోవడం తప్పారా??
ఏకాంబరం : ఛ..ఛ!! అవ్వాలనుకోవడం తప్పు కాదు, వెళ్ళాలనుకోవడం తప్పు కాదురా.. కానీ వేసే ప్రతి అడుగు చాలా ఆచితూచి వెయ్యాలిరా.. అసలే సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పి మోసం చేసే ఎదవలు ఎక్కువైపోయారీ మధ్య.
కనకాంబరం : అవునా??? ఎవర్రా వాళ్ళు??
ఏకాంబరం : ఎవరంటే ఏం చెప్తాం. సింపుల్ గా ఫేస్‌బుక్ లో మేం ఇక్కడ పని చేస్తాం మేం అక్కడ పని చేస్తాం అని చెప్తారు, ఒక్క సినిమాకి కూడా పని చేయకుండా వర్కింగ్ ఎట్ టెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనో, లేదా ఎవరో బాగా సక్సెస్ అయిన యాంకర్ ది ఫేక్ ప్రొఫైల్ పెట్టుకుని, వాట్సాప్‌లో ఆ యాంకర్ ఫోటోనే పెట్టుకుని వాళ్ళలానే మెసేజిలను చేస్తూ.. నీకక్కడ ఛాన్సిస్తాం, ఇక్కడ ఛాన్సిస్తాం అని ఎదవ మోసపు కబుర్లు చెప్పి ఇలానే నాశనం చేసేస్తారు. పాపం ఆ ఒరిజినల్ యాంకర్‌కి తెలియకుండా అతని పేరుతో మోసం చేసేస్తున్నారు.
కనకాంబరం : ఇలాంటి వెదవల్ని నరికేయాలిరా.. మగాల్ని మోసం చేయలేక ఇలా ఆడాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు.
ఏకాంబరం : గొప్పోడివిరా బాబూ.. సినిమా ఫీల్డ్‌లో మోసం అంటే ఏంటనుకున్నావ్?? అక్కడ నక్కల్లాంటి వాళ్ళు కూడా మేకలా మేకప్ వేసుకుని తిరుగుతారు. అమ్మాయి కాబట్టి రేప్ చేసారు. మగాళ్ళ దగ్గరైతే మనం మన సినిమానో / సాంగునో హిట్ చేయాలంటే ఇంత ఖర్చు పెట్టాలి, వీళ్ళకి డబ్బులివ్వాలి అని, ప్రమోషన్లు చేస్తాం, పేపర్లో ఇంటర్వ్యులేస్తాం అని చెప్పి డబ్బులు సైడేసేస్తారు.
కనకాంబరం : వార్నీ.. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా??
ఏకాంబరం : ఇంకా చాలా రకాల వాళ్ళుంటారు. నిన్న నాగబాబు గారి ఇంటర్వ్యూ  చూడలేదా??
కనకాంబరం : నేను నాగబాబు గారిని జబర్దస్త్ లో మాత్రమే చూసారా.. ఇంతకీ ఏమైంది?
ఏకాంబరం : చిరంజీవి అంతటోడి సినిమానే.. రిలీజ్ అవ్వకుండానే బాలేదు, ఫ్లాపు అని చెడు ప్రచారం చేస్తున్నారంట..
కనకాంబరం : అయ్యయ్యో.. రిలీజ్ అని ఇంకా వాల్‌పోస్టర్లే అంటించలేదు కదరా మన ఊళ్ళో..
ఏకాంబరం : అదే మరి ఆయన భాధ కూడా.. చూసాక చెప్పినా ఫర్లేదు. ఏం బాలేదో ఎందుకు బాలేదో.. చూడకముందే ఏంటీ పెంట అని అడుగుతున్నారాయన..
కనకాంబరం : చాలా దారుణంరా.. ఎలా అయినా అడ్డు కట్టెయ్యాలి ఇలాంటెదవలకి.
ఏకాంబరం : అడ్డుకట్ట సంగతి వాళ్ళు చూసుకుంటారు కానీ.. నువ్వు నీ గ్లాసులోకి మందేసుకోరా బాబూ.. ఏం భాధ పడకు. ఆ ఎదవల్ని పోలీసులు పట్టేసుకున్నారంటలే… రేప్పొద్దున్నే మనూరి శివాలయంకి వెళ్ళి కొత్త సంవత్సరంలో ఇలాంటి పాపాలు.జరగకుండా చూడమని దణ్నమెట్టుకుందాంలే..!!!
–V.K

Recent Articles English

Gallery

Recent Articles Telugu