
నారా లోకేశ్ ఏ ముహూర్తాన పాదయాత్ర మొదలు పెట్టారో కానీ, వైసీపీ వాళ్లకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా లోకేశ్ పాదయాత్రకు జనం బలంగా వస్తున్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నారా లోకేశ్ పాదయాత్రకు జగన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చి వుంటే బాగుండేదని, ఇప్పుడు నారా లోకేశ్ పాదయాత్ర బాగా సక్సెస్ అయితే, వైసీపీ పార్టీ పరువు పోతుందనే భావన వైసీపీ నేతల్లో వుంది. వారి ఆవేదన అర్థం చేసుకోతగిందే. ఏదో రకంగా లోకేశ్ పాదయాత్ర జనంలో చర్చనీయాంశం అవుతుంది. నిజానికి నారా లోకేశ్ అద్భుతమైన స్పీచ్ లు కూడా ఏం ఇవ్వడం లేదు. కాకపోతే, గతంలో చేసిన పొరపాట్లును ఈ సారి చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. టీడీపీ అభిమానులు కోరుకున్నది కూడా ఇదే.
నారా లోకేశ్ ఎక్కడ టంగ్ స్లిప్ కాకుండా ఉంటే.. ఇక అంతా పాజిటివ్ గానే పాదయాత్ర సాగుతుందని భావించారు. ప్రస్తుతం అదే జరుగుతుంది. అది ఇష్టం లేని వైసీపీ మీడియా లోకేశ్ పాదయాత్ర పై నెగిటివ్ ప్రచారాలను మొదలు పెట్టింది. నారా లోకేశ్ కి ఒక లక్ష్యం అంటూ ఏదీ లేదట. సీఎం జగన్ తన పాదయాత్రను అడ్డుకుంటున్నాడని, ఇలాగే చేస్తే ఇక దండయాత్ర తప్పదని లోకేశ్ తనకు తోచిన ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని కథనాలు రాస్తున్నారు. లోకేశ్‌కు పాదయాత్ర భారమైందంటూ పుకార్లు వైరల్ చేస్తున్నారు. చంద్రబాబే.. లోకేశ్ కు ఆడుగులు ముందుకు వేయని తప్పనిసరి పరిస్థితులను కల్పించారని, లోకేశ్ నెత్తికెత్తుకున్న పాదయాత్ర కారణంగా ఆయన బాగా నలిగిపోతున్నాడని ఇలా అనేక గాసిప్ లు క్రియేట్ చేశారు.
అసలు లోకేశ్ తానేం చేస్తున్నాడో ? ఎందుకు చేస్తున్నాడో కూడా లోకేశ్ కి అర్ధం కావడం లేదు అంటూ వార్తలు అల్లుతున్నారు. మరి వైసీపీ మీడియా చూపిన విధంగానే లోకేశ్ కి ఏం అర్ధం కాకపోతే.. లోకేశ్ మాటలను ఎందుకు మీరు ప్రచారం చేయడం లేదు ?. కూలీ మీడియా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలదా ?. లోకేశ్ పాదయాత్రలో తన తంటాలేవో తాను పడుతున్నాడు. ఏం పడినా తన పాదయాత్రను సక్సెస్ చేశాడు. టీడీపీ అభిమానులు కారణంగానే సక్సెస్ అయ్యింది అనుకోవడానికి లేదు. లోకేశ్ పాదయాత్రలో మొదట స్వచ్ఛంగా వచ్చిన జనాలు తక్కువమందే ఉన్నారు. కానీ.. పాదయాత్ర స్టార్ట్ చేసి.. తాను ఏం చేస్తాడో.. తన పార్టీ ఏం చేస్తోందో అని చెబుతూ ప్రజలను తన వైపుకు తిప్పుకున్నాడు.
అందుకే.. వైసీపీ వారు వర్మ లాంటి పిచ్చోళ్లను కూడా లోకేశ్ పైకి ఉసి కోల్పోతున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. నారా లోకేశ్ పాదయాత్రలో సీరియస్ నెస్ కనిపిస్తోంది. నారా లోకేశ్ చెస్ట్ నొప్పి అనో, లేక లిగమెంట్ తెగిందనో చెప్పి విశ్రాంతి తీసుకోవచ్చు. గతంలో జగన్ రెడ్డి కూడా కొంత విరామం తీసుకున్నాడు. కానీ, నారా లోకేశ్ అలా కాదు, లోకేశ్ కాలుకు చిన్న గాయం అయ్యింది. సో.. పాదయాత్రకి బ్రేక్ ఇవ్వడం చాలా తేలిక. డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడక కంటిన్యూ చేయొద్దు అన్నాడు అంటూ సర్టిఫికెట్ తెచ్చుకుని పాద యాత్రకు బ్రేక్ ఇవ్వొచ్చు. కానీ లోకేశ్ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. వర్మ లాంటివాళ్లు చచ్చు సలహాలు ఇచ్చినా లోకేశ్ రియాక్ట్ కూడా కావడం లేదు.
లోకేశ్ పట్ల టీడీపీ పెద్దలు కూడా ఓ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారట. పార్టీ పట్ల లోకేశ్ నే మెయిన్ పేస్ గా ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే, జగన్ సర్కార్ అడుగడుగునా లోకేశ్ పాదయాత్ర ఆటంకాలు సృష్టిస్తోందనేది నిజం. ఒకవేళ జగన్ రెడ్డి, ఏదోకటి చెప్పి కొత్త జీవో తెచ్చి.. లోకేశ్ పాదయాత్ర ఆపేసినా, ముందుగా జగన్ రెడ్డే అభాసుపాలు అవుతారు.












