HomeTelugu Trendingఇలియానా న్యూలుక్‌

ఇలియానా న్యూలుక్‌

5 23టాలీవుడ్‌లో దేవదాస్ సినిమాతో పరిచయమైనా గోవా బ్యూటీ ఇలియానా ఆ తరువాత కాలంలో వరస సినిమాలతో బిజీ అయ్యింది. స్టార్ హీరోలందరితో జత కట్టింది.. బర్ఫీ సినిమాతో బాలీవుడ్‌లో మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్ అక్కడే సెటిల్ అయ్యింది. అయితే, ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడిన ఈ అమ్మడు ఆ తరువాత కెరీర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. బరువు పెరిగింది. ఇండస్ట్రీలో బరువు అన్నది భారం కాబట్టి హీరోయిన్లు సన్నగా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ప్రియుడితో బ్రేకప్ ఆతరువాత ఇలియానా సన్నబడిందని, వార్తలు వచ్చాయి. ఇలియానాకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, తాజాగా ఇలియానా ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫొటోలో చూస్తుంటే ఇలియానాలో ఏవైనా మార్పులు వచ్చాయా అంటే… గతంలో కంటే కాస్త సన్నబడినట్టుగా కనిపిస్తోంది. ఇలియానా ఇంకా సన్నబడాలి. ప్రస్తుతం పాగల్ పంటి, ది బిగ్ బుల్ సినిమాలు చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu