Homeతెలుగు Newsటార్గెట్‌ ఫినిష్ చేశాం.. ధ్రువీకరించిన భారత్‌

టార్గెట్‌ ఫినిష్ చేశాం.. ధ్రువీకరించిన భారత్‌

2 25నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడి చేసినట్లు భారత్‌ ధ్రువీకరించింది. ఈ మేరకు దాడి వివరాలను భారత విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియా సమావేశంలో వెల్లడించారు.

‘పాకిస్థాన్‌ కేంద్రంగా జైషే మహ్మద్‌ రెండేళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తోంది. బహావల్‌పూర్‌ నుంచి వరుసగా ఉగ్రదాడులకు పాల్పడుతోంది. భారత్‌లోని పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేపట్టేందుకు జైషే మహ్మద్‌ యత్నిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. ఇందుకోసం ఫిదాయిన్‌ జిహాదీలకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. ఉగ్రవాదులకు గట్టిగా బదులిచ్చేందుకే ఈ రోజు తెల్లవారుజామున నిఘా వర్గాల నేతృత్వంలో ఆపరేషన్ చేపట్టాం. జైషే మహ్మద్‌కు చెందిన అతిపెద్ద ఉగ్ర శిబిరమైన బాలకోట్‌లో దాడి చేశాం. ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్‌ కమాండర్‌లు, జిహాదీలను మట్టుబెట్టాం. ఈ ఉగ్రశిబిరం జైషే అధినేత మసూద్‌ అజార్‌ బంధువైన మౌలానా యూసఫ్‌ అజార్‌ అలియాస్‌ ఉస్తాద్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ శిబిరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు’ అని గోఖలే తెలిపారు.

ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌ కట్టుబడి ఉందని, అందుకోసం ఎలాంటి చర్యలైనా చేపట్టేందుకు సిద్ధమని గోఖలే అన్నారు. జైషే ఉగ్ర శిబిరాన్ని లక్ష్యంగా చేసకుని సైనికేతర దాడి చేపట్టినట్లు చెప్పారు. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు నిర్దేశిత లక్ష్యాలపైనే దాడి చేసినట్లు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu