తెలుగు రాష్ట్రాలకు ఏడు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి అవార్డుల జాబితాలో నిలవగా.. తెలంగాణ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్‌ నిలిచాయి. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఇండోర్‌ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. 2019 సంవత్సరానికి గానూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం విజ్ఞాన్‌భవన్‌లో ప్రదానం చేశారు.

స్వచ్ఛ నగరాల జాబితా కోసం జనవరి 4 నుంచి 31 వరకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. మొత్తం 4,237 పట్టణాలు, నగరాల్లో ఈ సర్వే చేపట్టింది. ఈ జాబితాలో ఇండోర్‌ అగ్రస్థానంలో నిలిచింది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019 అవార్డుల వివరాలు ఇలా..

– అత్యంత స్వచ్ఛమైన నగరంగా ఇండోర్‌

– అత్యంత స్వచ్ఛమైన రాజధానిగా మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌

– స్వచ్ఛత కోసం పాటుపడుతున్న టాప్‌ 3 రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర

– 10లక్షల కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో స్వచ్ఛమైన నగరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌

-3-10లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరం ఉజ్జయిని

– 1-3లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరం న్యూదిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌