HomeTelugu Trendingబిగ్‌బాస్‌-7 హోస్ట్‌.. నాగార్జున కాదా?

బిగ్‌బాస్‌-7 హోస్ట్‌.. నాగార్జున కాదా?

Bigg boss
బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌. తెలుగులో ఈ షో 6 సీజన్‌లు పూర్తి చేసుకుంది. మొదట్లో ఈ షోకి మంచి క్రేజ్‌ ఉండేది. అయితే రానురానూ.. కంటెస్టెంట్స్ సెలక్షన్స్ నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్.. ఫైనల్ గా టైటిల్ విన్నర్ ఎపిసోడ్ కూడా సాదాసీదాగా జరగడంతో ఈ షోపై నెటిజన్లకు ఆసక్తి తగ్గిపోయింది. ఇక సీజన్‌-6 కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

ఈ సీజన్‌లో నాగార్జున హోస్టింగ్‌ కూడా ఆశించిన స్థాయిలో హోస్టింగ్ చేయలేదని అనిపించింది. బిగ్‌బాస్ హోస్ట్ గా నాగార్జున కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టేశాడు. అయితే సీజన్-7 విషయంలో అలాంటి తప్పులు జరగకుండా కూడా.. కంటెస్టంట్స్ ఎంపిక నుంచి టాస్కుల వరకు అంతా పర్ఫెక్ట్ గా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట బిగ్‌బాస్‌ నిర్వాహకులు.

ఇక సీజన్-7 హోస్ట్‌ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారట. బిగ్‌బాస్ సీజన్-3 నుంచి 6తో పాటుగా బిగ్‌బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ బిగ్‌బాస్‌కి హోస్ట్ గా చేశాడు నాగార్జున. అయితే గతంలో ఎంతో ఎనర్జిటిక్‌గా అనిపించగా సీజన్-6 లో మాత్రం నాగార్జున ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాదు నాగార్జునకి కూడా బిగ్‌బాస్ మీద ఇంట్రెస్ట్ పోయిందని అంటున్నారు. అందుకే బిగ్‌బాస్ టీం హోస్ట్ ని మార్చుదామన్న వెంటనే నాగార్జున కూడా అందుకు ఓకే చెప్పేశారంట.

Bigg boss1

అయితే బిగ్‌బాస్-7 హోస్ట్ గా ఎవరు చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్‌-1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా సీజన్- 2కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఇద్దరూ బిజీగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు హోస్ట్ గా చేస్తారా అంటే ఛాన్సే లేదని తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్-7 రానా హోస్ట్‌గా చేయనున్నట్లు తెలుస్తుంది. రానా ఇప్పటికే హోస్ట్‌గా చేసిన అనుభవం ఉంది. రానా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటున్నారు ఆడియన్స్. అయితే రానా చేయకపోతే.. ఎవరు చేస్తారు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

Bigg boss2

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu