
IPL 2025 Cancelled:
భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్న IPL 2025 సీజన్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత యుద్ధ వాతావరణం తలెత్తడంతో, దేశ భద్రత ముందు IPL కీలకమా? అన్న చర్చ మొదలైంది.
ఇప్పటికే కొన్ని నెట్‌వర్క్స్, సోషల్ మీడియాలో IPL ను తక్షణం రద్దు చేయాలని, దేశానికి పూర్తి మద్దతు ఇవ్వాలని నినాదాలు చేస్తున్నారు. “క్రికెట్ కాదు.. దేశమే ముఖ్యమని” భావిస్తున్న పౌరులు పెద్ద సంఖ్యలో ఎదురయ్యారు. ఇందులో సెలబ్రిటీలు, టీవీ చానళ్లు కూడా పాల్గొంటున్నారు. 2022 వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ అందించిన విజయాన్ని మళ్లీ చూపిస్తూ దేశభక్తిని ఊరించారు.
ఇంతలో DC vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ మాత్రం షెడ్యూల్ ప్రకారం జరగనుంది. కానీ ముంబయి ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ధర్మశాలలో జరగడం అనిశ్చితంగా మారింది.
ఈ పరిస్థితుల్లో BCCI ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే. IPL కొనసాగాలా? లేక దేశం పిలిస్తే ఆట ఆపాలా? అన్నదానిపై త్వరలో క్లారిటీ రావొచ్చు.













