ఐరన్ లేడీ బయోపిక్ లో తాప్సీ !

ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ మొదలైంది. ధోని, పుల్లెల
గోపిచంద్ వంటి వారి బయోపిక్స్ ను సిద్ధం చేస్తున్నారు.
అదే కోవలో ఇప్పుడు ఇరోం షర్మిల జీవిత గాథను తెరకెక్కించడానికి ప్రయత్నాలు
జరుగుతున్నాయి.
దర్శకుడు వికాస్ కె.ద్వివేది షర్మిల జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలను సేకరించి
కథను సిద్ధం చేసుకున్నాడు.
ఈ కథను మన సొట్టబుగ్గల సుందరి తాప్సీకు వినిపించగానే బాగా ఎగ్జైట్ అయిందట.
వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.
ఈ సినిమాకు ‘ఇంఫాల్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.

CLICK HERE!! For the aha Latest Updates