హన్సిక పెళ్లిపీటలు ఎక్కనుందా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన హన్సిక ‘దేశముదురు’ చిత్రంతో సౌత్ లో ఎంటర్ అయింది. తన క్యూట్ లుక్స్ తో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది. కొన్నాళ్ళకు తెలుగులో ఛాన్సులు తగ్గడంతో తన మకాంను కోలీవుడ్ కు షిఫ్ట్ చేసింది.

అతి తక్కువ కాలంలోనే తమిళంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామకు ఏకంగా అక్కడ గుడి కూడా కట్టేశారు. అయితే రాను రాను తమిళంలో కూడా హన్సికకు అవకాశాలు రావడం తగ్గుతున్నాయి. కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం, నిర్మాతలు ఫ్రెష్ ఫేస్ కోసం చూడడం వంటి కారణాలతో హన్సికకు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి.

దీంతో ఆమెకు పెళ్లి చేయాలని హన్సిక పేరెంట్స్ నిర్ణయించుకున్నారని కోలీవుడ్ మీడియా వార్తలను ప్రచురించింది. అయితే దీనికి విరుద్ధంగా ఆమె తల్లి మోనా స్పందించింది. హన్సిక వయసు 24 ఏళ్ళేనని.. ఆమెకు ఇప్పుడు పెళ్లి చేయాలనే ఆలోచన లేదని తేల్చి చెప్పింది.