HomeTelugu Trendingసినిమాకి 25 కోట్లు అని AR Rahman నే దాటేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..

సినిమాకి 25 కోట్లు అని AR Rahman నే దాటేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..

Is Mithoon Really Charging more than AR Rahman?
Is Mithoon Really Charging more than AR Rahman?

AR Rahman Remuneration:

ఇప్పుడు టాలీవుడ్‌లో నటులతో పాటు మ్యూజిక్ డైరెక్టర్లూ భారీ పారితోషికాలు తీసుకుంటున్నారు. సినిమాలో పాటలు హిట్ అయితే, ఆ క్రేజ్ అంతే. అలాంటి సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు మిథూన్ పేరునే ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఒక సినిమాకు ఏకంగా రూ.25 కోట్లు తీసుకుంటున్నాడట!

ఇది విన్నవెంటనే బాలీవుడ్‌లో కూడా షాక్ అయ్యారట. ఎందుకంటే A.R. రెహ్మాన్, ఎం.ఎం. కీరవాణి లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా 10 నుంచి 15 కోట్ల పరిధిలోనే పారితోషికం తీసుకుంటారు. అనిరుధ్ కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ కూడా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తాడట. కానీ మిథూన్ మాత్రం వీళ్లందరినీ దాటి రికార్డు క్రియేట్ చేశాడట.

ఇక అసలైన ప్రశ్న ఏంటంటే – మిథూన్ అసలు అంత క్రేజ్ ఉన్నాడా? అతని బ్లాక్‌బస్టర్ హిట్స్ ఏమున్నాయంటే, “గదర్ 2” ఒక్కటే చెప్పుకోవచ్చు. కానీ నేషనల్ లెవెల్‌లో పెద్దగా గుర్తింపు లేదు. అప్పుడు ఇలా రూ.25 కోట్లు చెల్లించడం నిజంగా జరిగిందా? లేక ఇది ఒక పీఆర్ స్టంటా?

ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయిపోయింది. మిథూన్ పేరు నార్త్ ఇండియాలో కూడా అంతగా గుర్తింపు లేకపోయినా, ఈ స్థాయి రేట్ అంటే ఆశ్చర్యమే. ఇంకో ఆసక్తికర విషయం – ఆ సినిమా పేరు ఇప్పటికీ బయటకు రాలేదు. ఇది ఏ సినిమా? ఎవరు ఇచ్చారు అంత పెద్ద పారితోషికం?

కనీసం ఇది ఒక హై బడ్జెట్ సినిమా అయితే ఏమో. కానీ మిథూన్ స్టైల్, పాటల పాపులారిటీ చూసినవారికి మాత్రం ఇది అంత ఆశ్చర్యంగా లేదు. అయినా కూడా, ఇంత ఎక్కువ పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయన పేరు చరిత్రలో నిలుస్తాడేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!