HomeTelugu Trendingలారీ డ్రైవర్‌గా అల్లు అర్జుణ్ లుక్‌ ఇదేనా.. వైరల్‌

లారీ డ్రైవర్‌గా అల్లు అర్జుణ్ లుక్‌ ఇదేనా.. వైరల్‌

9 13
టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘అల వైకుంఠపురములో..’ తో హిట్‌ అందుకున్న ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. కేరళలో ఈ సినిమా షూటింగ్‌ జరగబోతోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే మాఫియా కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారట. ఈ మేరకు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా బన్నీ తాజా లుక్‌ బయటికి వచ్చింది. ఆయన శనివారం తన బాడీగార్డు పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బన్నీ గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో కనిపించారు. ఆయన తర్వాతి సినిమాలో లుక్ ఇదేనని నెటిజన్లు భావిస్తున్నారు. ‘రంగస్థలం’లో చరణ్‌ కూడా ఇలాగే గుబురు గడ్డంతో సినిమా మొత్తం కనిపించడమే కాదు.. తన నటనతో మెస్మరైజ్‌ చేశారు. సుకుమార్‌ మరోసారి ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

9a

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!