‘ఇజం’కు అన్ని కోట్ల నష్టమా..?

ప్రస్తుతం సినిమా అంటే వ్యాపారమే… కోట్ల పెట్టుబడి పెట్టి తీస్తున్న సినిమాలు లాభాలను
తీసుకురాకపోతే ఆ నిర్మాతల పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ లాభాలు రావాలనే
సినిమాలు తీస్తారు. ఫైనల్ గా రిజల్ట్స్ అనేవి ప్రేక్షకుల చేతుల్లో ఉంటాయి. అయితే కొన్ని
చిత్రాలు రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ ను జరుపుకొని టేబుల్ ప్రాఫిట్ లో ఉంటాయి. కొన్ని
సినిమాలకు మాత్రం బిజినెస్ కూడా సరిగ్గా జరగదు. కల్యాణ్ రామ్ నటిస్తోన్న ‘ఇజం’ సినిమా
పరిస్థితి కూడా అలానే ఉంది. దాదాపు పాతిక కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా నష్టాలకు
అమ్ముకోవాల్సి వచ్చింది. అన్ని ఏరియాల్లో కలిపి 16 కోట్లకు మించి బిజినెస్ జరగలేదని టాక్.
శాటిలైట్ హక్కుల ద్వారా మరో 3 కోట్లు వచ్చినా.. మొత్తం 19 కోట్లు మాత్రమే సినిమాకు
వచ్చాయి. అంటే ఆరు కోట్ల నష్టానికి సినిమాకు అమ్మేశారు. సినిమా రిజల్ట్ విషయంలో
కాన్ఫిడెంట్ లేకపోవడం వలనే నష్టాలకు సినిమాను అమ్మేశారనే మాటలు వినిపిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates