HomeTelugu Big Storiesఇక్కడి యాక్టర్స్ ను, ఫారెన్ యాక్టర్స్ ను కలిపి సినిమా చేస్తా!

ఇక్కడి యాక్టర్స్ ను, ఫారెన్ యాక్టర్స్ ను కలిపి సినిమా చేస్తా!

కల్యాణ్ రామ్, అదితి ఆర్య జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఇజం’. ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ విలేకర్లతో ముచ్చటించారు.
ఇజం ద్వారా ఏం చెప్పబోతున్నారు..?
‘ఇజం’ ఒక జర్నలిస్ట్ కథ. జర్నలిస్ట్ యొక్క ఐడియాలజీను ఈ సినిమాలో చూపించబోతున్నాం. సొసైటి లో చాలా కరెప్షన్స్ ఉన్నాయి. వాటిని అతడు ఎలా పరిష్కరించాడనే అంశాల మీద సినిమా నడుస్తుంది.
ఈ కథకు కల్యాణ్ రామ్ గారిని ఎన్నుకోవడానికి కారణం..?
కల్యాణ్ రామ్ గారితో సినిమా చేయాలనుకున్నప్పుడు ఈ కథనే  చెప్పాలనుకున్నాను. జర్నలిస్ట్ ఒక డైలాగ్ చెప్పేప్పుడు నిజాయితీ కనిపించాలి. ఆ నిజాయితీ కల్యాణ్ గారిలో కనిపిస్తుంది. చాలా బాగా నటించారు. ముఖ్యంగా రెండో భాగంలో ఆయన నటన అధ్బుతమనే చెప్పాలి.
హీరో పాత్ర ఎలా ఉండబోతోంది..? 
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు సత్య మార్తాండ్. ఆ పేరు పెట్టడానికి ఓ కారణముంది. ఇండియాలో
ప్రారంభమయిన మొదటి మ్యాగజీన్ పేరు ‘మార్తాండ్’. సత్య అంటే నిజం. అందుకే హీరోకు ఆ పేరు పెట్టాం. ఈ సినిమాలో హీరో ఎవరికి హితబోధ చేయడు. తన పెయిన్ ను చెబుతాడు.
కథకు హీరో సిక్స్ ప్యాక్ అవసరమా..? 
మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండే జర్నలిస్ట్ తను మాట్లాడేప్పుడు ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే కల్యాణ్ రామ్ గారిని సిక్స్ ప్యాక్ చేయమని చెప్పాను. ఆయనకు కథ బాగా నచ్చడంతో సీరియస్ గా తీసుకొని మూడు నెలల్లో 14 కిలోలు తగ్గారు. అది మామూలు విషయం కాదు. ఫిట్ నెస్ విషయంలోనే కాదు పెర్ఫార్మన్స్ విషయంలో కూడా.. ఆయన బెస్ట్ యాక్టర్. ఈ దెబ్బతో రెండు రాష్ట్రాల్లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కొట్టేస్తాడు.
ఈ సినిమాతో కొత్త పూరీ జగన్నాథ్ ను చూడబోతున్నామని కల్యాణ్ రామ్ అన్నారు. దానిపై 
మీ స్పందన..? 
మంచిదేగా(నవ్వుతూ..). ప్రేక్షకులు కూడా కొత్తగా చూస్తే బావుంటుంది. నా మీద నాకే బోర్ కొట్టింది. నిజంగానే సినిమా కొత్తగా ఉంటుంది.
మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు ఉంటుంది..? 
మహేష్ బాబు కోసం ఓ కథ ను సిద్ధం చేసుకొని ఆయనకు వినిపించాను. అదే ‘జనగణమన’. ఆయనకు కూడా కథ బాగా నచ్చింది. కానీ ఆ తరువాత ఎలాంటి స్పందన లేదు. సమాజాన్ని నేను చూసే కోణం, సమాజంపై నా అవగాహన ప్రతిబింబించే విధంగా సినిమా ఉంటుంది. బెస్ట్ స్క్రిప్ట్ అని చెప్పగలను.
చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉందా..? 
నా దగ్గర పదేళ్ళ వరకు సరిపడే కథలు ఉన్నాయి. అవి చాలా మంది హీరోలకు చెబుతాను. కొందరికి నచ్చుతాయి.. మరికొందరికి నచ్చవు. అయితే ఆ కథలన్నీ సినిమాలుగా రావడం ఖాయం కానీ కాస్త సమయం పట్టొచ్చు. ఇటీవలే ఎన్టీఆర్ కు కూడా కథ చెప్పాను. ఇంకా కన్ఫర్న్ కాలేదు. రవితేజ గారితో ఓ సినిమా చేయాలనుకున్నా.. కానీ ఇప్పుడు ఆయన ట్రావెలింగ్ లో బిజీగా ఉన్నారు.
పూరీ కనెక్ట్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉన్నారు. దాని ఉద్దేశ్యం ఏంటి..? 
కొత్త వాళ్ళతో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నాం. సినిమాలను నిర్మించడంతో పాటు యాడ్ ఏజెన్సీను కూడా రన్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడి యాక్టర్స్ ను, ఫారెన్ యాక్టర్స్ ను కలిపి ఓ సినిమా చేయాలనివుంది.
బాలీవుడ్ కు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా..?
ఆఫర్స్ అయితే చాలా వస్తున్నాయి. కానీ అనుకున్న వెంటనే అక్కడ సినిమా అవ్వదు. కనీసం ఆరు నెలలైనా ఎదురుచూడాలి. ఆ గ్యాప్ లో నేనొక సినిమా చేసేస్తాను. టెంపర్ సినిమాను బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేయాలనుకున్నా.. కానీ ఎన్టీఆర్ లా నేను చేయలేనని ఆయన చెప్పారు. ఫ్యూచర్ లో మంచి అవకాశాలు వస్తే చేస్తాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
రోగ్ సినిమా షూటింగ్ పూర్తయింది. మంచి ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందిస్తున్నాం. డిసంబర్  నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu