బాలకృష్ణపై ఐటీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్‌ మక్తాలా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. మొన్నటిదాకా ఐటీ స్పెల్లింగ్‌ తెలియని తెలంగాణ వాళ్లకు చంద్రబాబు ఐటీ డెఫినిషన్‌ తెలియజెప్పారని బాలయ్య వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన సీడీని ఈసీ అందజేసింది. ఉద్దేశ పూర్వకంగా ఐటీ ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని స్పష్టంచేసింది. సైబరాబాద్‌ అభివృద్ధి చేసింది తానేనని, ఐటీ ఉద్యోగులు ఈ విషయం గుర్తుంచుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించడాన్ని కూడా ఖండిస్తున్నట్లు పేర్కొంది.