నాని సినిమా ఫస్ట్‌లుక్‌ వచ్చేది అప్పుడే!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ కూడా చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ.. ”ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలో జరుగుతోంది. మార్చి 10 వరకు ఈ షెడ్యూల్‌ వుంటుంది. మా హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేయడంతోపాటు టైటిల్‌ని కూడా ఎనౌన్స్‌ చేయ్యబోతున్నాం” అన్నారు.
నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.