
జగన్ రెడ్డికి కొత్త భయం పట్టుకుంది. తన పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారా ? అని జగన్ రెడ్డి భయంతో మగ్గిపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు ఎమ్మెల్యేల పై అనుమానం వచ్చింది. వారిని పిలిచి మాట్లాడాడు. ఇకనైనా మీరు మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఐతే, సదరు ఎమ్మెల్యేలు జగన్ కంటే.. సీనియర్లు కావడంతో ఎదురు సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఎదురు మాటలను జగన్ జీర్ణించుకోక ముందే మరో ఇద్దరు మంత్రుల పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే.. ఆ ఇద్దరు మంత్రులను ప్రత్యేకంగా పిలిచి మరీ క్లాస్ తీసుకున్నాడు మన జగన్ రెడ్డి.
క్లాస్ అంటే ఏదో అనుకునేరు. అక్కడ ఏమీ ఉండదు. జగన్ రెడ్డి తనదైన శైలిలో బెదిరించే ప్రయత్నం చేస్తాడు. ఈ సిల్లీ బెదిరింపులు కారణంగానే వైసీపీ రెబల్స్ అయిపోయారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక మంత్రులకు జగన్ వార్నింగ్ విషయానికి వస్తే..’మీ తీరు మార్చుకోకపోతే ఇక అస్సలు ఊరుకునేది లేదు. నేను ఏమిటో నా పద్దతి ఏమిటో మీకు తెలుసు. నాకు అనవసరంగా కోపం తెప్పించకండి’ ఇలా సాగింది జగన్ వార్నింగ్. మరి కోపం తెప్పిస్తే ఏమి అవుతుంది ?, ఏమైనా అవ్వొచ్చు, ఏ గొడ్డలి పోటు అయినా పడొచ్చు, లేకపోతే ఏ లాఠీ దెబ్బ అయినా పడొచ్చు.
అందుకే. సీఎం మాట్లాడుతున్నంత సేపు మంత్రుల నోట నుండి ఒక్కమాట కూడా బయటకు రాలేదు. అసలు జగన్ రెడ్డి ఇంతలా సీరియస్ అయ్యేలా మంత్రులు ఏం చేశారు..? ఇంతకీ ఆ ఇద్దరు మంత్రులు ఎవరు..? ఏ ప్రాంతాలకు చెందినవారు..? ఎప్పుడూ లేనంతగా ఎందుకిలా జగన్ రెడ్డి వారిని హెచ్చరించారు..? చూద్దాం రండి. ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరు కోస్తాంధ్రకు చెందిన వ్యక్తి. మరొకరు రాయలసీమకు చెందిన మహిళా మంత్రి. వీరిద్దరూ జగన్ రెడ్డి భజన బ్యాచ్ ముఖ్య సభ్యులే. పైగా మొదటిసారి మంత్రి పదవి దక్కించుకున్న వారే. ఐతే, వీరి పనితీరు ఏ మాత్రం బాగాలేదు.
పైగా నియోజకవర్గాల్లో దందాలు మొదలు పెట్టారు. అవినీతికి అవకాశం ఉన్న ఏ అవకాశాన్ని సదరు మంత్రులు వదిలిపెట్టలేదు. కోతి ముందు కుప్పిగంతులా ?, ఒక అవినీతి చక్రవర్తి ముందు లంచాలా ?. అందుకే, ఆ ఇద్దరు మంత్రుల వ్యవహారం జగన్ రెడ్డికి ముందుగానే తెలిసిపోయింది. ‘మీకు కేటాయించిన శాఖలు.. మీ మీ నియోజకవర్గాల్లో మీకు ఏది ప్లస్ అయినా పార్టీకే చెందాలి, ముఖ్యంగా నాకు తెలియాలి. అని కన్నెర్రజేశారు. మంత్రులు చేసిన అవినీతిని ఒక్కొక్కటిగా ప్రస్తావించి మరీ, ఈ సారి ఆ సొమ్ము అంతా నేరుగా తన దగ్గరకే గట్టిగా రావాలని అర్దగంటపాటు తలంటారు జగన్ రెడ్డి గోరు.













