Homeతెలుగు వెర్షన్పంట వదిలేసి పరిగ ఏరుకుంటున్న జగన్ రెడ్డి

పంట వదిలేసి పరిగ ఏరుకుంటున్న జగన్ రెడ్డి

Another rebellion against Jagan Reddy.. These are the YCP MLAs
చంద్రబాబు నాయుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ సీఎం కావాలి ? అని అడిగే వర్గాలకు ఈ కథనం సరైన సమాధానం.  హైదరాబాద్ లో ఫార్ములా E రేస్ జరిగితే ప్రపంచవ్యాప్తంగా వున్న రేసర్లు పాల్గొన్నారు. ఇది నేషనల్ న్యూస్ అయ్యింది. ఈ రేస్ చూడటానికి వేల రూపాయలు టికెట్ ధర పెట్టినా దేశవ్యాప్తంగా వచ్చిన వీక్షకులు పోటెత్తారు. ఇది కదా తెలుగువాడి ప్రతిష్టకు నిదర్శనం అన్నారు. దీన్ని ఏర్పాటు చేసిన కేటీఆర్ కు ప్రస్తుతం తెలంగాణ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మంచిది. ఇటువంటి ఒక కార్యక్రమ నిర్వహణ కోసం తోడ్పాటు అందించిన.. చొరవ చూపిన తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేటీఆర్ ను తప్పక అభినందించి తీరాలి.  కానీ మీకు తెలుసా ?, ఈ  ఫార్ములా E రేస్ గురించి మొదటి ఆలోచించింది చంద్రబాబు గారే అని.     
 
1995 – 2004 మధ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ క్రీడ ఔన్నత్యాన్ని,  దాని వల్ల ఒనగూరే టూరిజం అభివృద్ధిని ముందే పసిగట్టారు.  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. వ్యాపార అవకాశాలు పెంచాలి అనే విజన్ తో యూరోప్ పర్యటనకు వెళ్లి అప్పట్లో ఫార్ములా వన్ ఛాంపియన్ గా తిరుగులేని ఆధిపత్యం చూపిస్తున్న మైఖేల్ షుమాకర్ గారిని కలిసి వారి ద్వారా ఫార్ములా వన్ నిర్వాహకులను కలిసి.. హైదరాబాద్ లో వుండే అవకాశాలను వివరించి  హైదరాబాద్ లో ఫార్ములా వన్ రేస్ శాశ్వత ప్రాతిపదికన నిర్వహణకు ఒప్పించి,  వారికి రంగారెడ్డి జిల్లా షాబాధ్ ప్రాంతంలో 3,000 ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది. వాస్తవంగా ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా కానీ,  పరోక్షంగా కానీ  ఆ ప్రాంతంలో ఒక లక్ష మందికి ఉపాధి దొరుకుతుంది అని  అప్పుడు చంద్రబాబు గారు అంచనా వేశారు.
 
టూరిజం.. హాస్పిటాలిటీ రంగాలు కొత్త పుంతలు తొక్కడం ఖాయం అని అంచనా వేశారు. అదే సుసాధ్యం అయి వుంటే  ఇటు చేవెళ్ల నుంచి అటు షాద్ నగర్ వరకు ఆ ప్రాంత ముఖచిత్రం ఎప్పుడో మారిపోయి ఉండేది. కానీ, ఆ రేస్ ప్రాజెక్ట్ అమలులోకి వచ్చేలోపే  సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఉచితాల మత్తులో పడి  బాబు గారిని ఓడించి వైఎస్సార్ గారిని సీఎం ను చేశారు.  వైఎస్సార్ కి ఈ ఫార్ములా వన్ ప్రాముఖ్యత గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడం కారణంగా  ఆ భూ కేటాయింపులు రద్దు చేశారు. మరి అప్పుడు వైఎస్సార్  కూడా  ఇప్పుడు ఆయనగారి కొడుకు చేస్తున్నట్టు చంద్రబాబు గారు తలపెట్టారు కాబట్టి  ఆ భూ కేటాయింపులు రద్దు చేశారేమో తెలియదు. వైఎస్సార్ వల్ల  అప్పుడు రాష్ట్రమే కాదు,  దేశమే ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది. 
 
ఐతే, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏమిటంటే.. విజన్ ఉన్నవాడికి – కురచ ఆలోచనలు వుండే వారికి మధ్య వ్యత్యాసం ఇప్పటికీ  ఏపీ ప్రజలు గుర్తించలేదు.  20 సంవత్సరాలు గడిచిన తరువాత  ఇప్పుడు జరిగిన ఈ చిన్న ప్రయత్నం హైదరాబాద్ కి కల్పించిన ఈ క్రేజ్ పుణ్యాన  అదే రేస్ చూడటానికి సచిన్ టెండూల్కర్ నుంచి  మన కోడిగుడ్డు అమర్నాథ్ దాకా హైదరాబాద్ కు క్యూ కట్టారు. విజన్ ఉన్న వాడు విస్తరి వేసి వడ్డిస్తే దాన్ని ముద్దలు గా కలుపుకుని తినడానికి కూడా మన మూడు ముక్కల మంత్రి జగన్ రెడ్డికి చేతకావడం లేదు అంటే.. ఏమనుకోవాలి ?, అలాంటి వ్యక్తిని ఆంధ్రాకి సీఎం ను చేసిన ప్రజలను ఏమనుకోవాలి ?. పంటకు బదులు పరిగ చూసుకునే సంతోష పడే  జగన్ రెడ్డి లాంటి నాయకులు ఉన్నంత వరకూ  ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలనుకోవడం  బహుశా అత్యాశే అవుతుందేమో.    

Recent Articles English

Gallery

Recent Articles Telugu