జగన్ ఓటు తొలగించాలంటు.. దరఖాస్తు!

ఓట్ల అక్రమ తొలగింపు వ్యవహారం ఏపీలో కలకలం సృష్టిస్తోంది.. ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేత జగన్‌ ఓటు తొలగించాలని దరఖాస్తు అందడం దుమారం రేపుతుంది. కడప జిల్లా పులివెందులలో జగన్ ఓటు తొలగించాలని ఆయన పేరు మీద ఆన్ లైన్ లో ఫారం- 7 దరఖాస్తు వచ్చినట్టు జిల్లా ఎన్నికల అధికారి హరికిరణ్ ధృవీకరించారు. వెంటనే విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని నోటీసుల ద్వారా జగన్ కు తెలియజేస్తామని ఎన్నికల అధికారి చెప్పారు. జగనే స్వయంగా దరఖాస్తు చేశారా లేక ఎవరైనా తప్పుడు పేరుతో దరఖాస్తు చేశారా అనే వివరాలు తెలుసుకుంటామన్నారు.