ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్‌ లేఖ!


క‌రోనా ఎఫెక్ట్‌తో.. స్కూల్స్‌, థియేట‌ర్స్‌, షూటింగ్స్‌, ప‌లు వేడుక‌లు, జ‌న‌స‌మూహంతో కూడిన ప్రాంతాల‌న్నీ నిర్మానుషంగా మారిపోయాయి. ఇక ప్ర‌తి ఏడాది ఘ‌నంగా జ‌రిగే హీరోల పుట్టినరోజు వేడుకలు కూడా ఈ సారి ర‌ద్దు అవుతున్నాయి. మాములుగా అయితే తమ ఫ్యాన్స్‌.. హీరో పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కు పెద్ద పండగే .. కటౌట్లు , భారీ ఫ్లెక్సీలు, కేకులు అంతా భారీ ఎత్తున జరుపుకుంటారు. ఇక పెద్ద హీరోల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. కానీ క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో హీరోలే స్వ‌యంగా రంగంలోకి దిగి త‌మ బ‌ర్త్ డే వేడుక‌ల‌ని జ‌ర‌పొద్దంటూ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ ను తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని కోరారు.

ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఎన్టీఆర్ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇక ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను కూడా జరపవద్దని అభిమానులను కోరారు. ‘ ప్రతి ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ చేసే సేవ కార్యక్రమాలు ఓ ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటిపట్టునే ఉంటూ అధికారుల సూచనలు పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం ‘అంటూ ఓ లేఖను విడుదల చేసారు. కాగా ఎన్టీఆర్ పుట్టిన రోజును సోషల్ మీడియాలో ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు అభిమానులు.