HomeTelugu Trendingఆర్కా మీడియా 'వెబ్‌ సిరీస్‌'లో జగ్గుభాయ్‌

ఆర్కా మీడియా ‘వెబ్‌ సిరీస్‌’లో జగ్గుభాయ్‌

Jagapathi babu in bahubali
టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు జగపతిబాబు. లెజెండ్ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వరుసగా రంగస్థలం, అరవింద సమేత సినిమాలలో జగ్గూ భాయ్‌ నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. అయితే రెండేళ్ల క్రితమే గ్యాంగ్‌స్టర్స్‌ చిత్రంతో డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు జగపతిబాబు. తాజాగా మరోసారి వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్నట్టు ఫిలింనగర్లో‌ ఓవార్త వైరల్‌ అవుతోంది. బాహుబలి సినిమా నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడట. అయితే సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సిరీస్ కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu