జగ్గుభాయ్ ‘పటేల్ సార్’!

జగపతి బాబు హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఇప్పుడు విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను
మొదలుపెట్టారు. అలానే పాజిటివ్ పాత్రల్లో కూడా కనిపిస్తున్నారు. మాజీ కర్నాటక ముఖ్యమంత్రి
హెచ్.డి.కుమారస్వామికి, జగపతి బాబుకి మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవల కుమారస్వామి
తన కొడుకు నిఖిల్ ను హీరోగా పరిచయం చేసిన ‘జాగ్వార్’ సినిమాలో కూడా జగపతిబాబు
ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు కుమారస్వామి, జగపతిబాబుని హీరోగా పెట్టి తన
బ్యానర్ లో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ చిత్రానికి ‘పటేల్ సార్’ అనే టైటిల్ ను
ఖరారు చేశారు. సాధారణంగా వూర్లలో ఉండే భూస్వాములను పటేల్ సారు.. అని పిలుస్తుంటారు.
బహుశా కథ కూడా అదే బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తుందేమో.. ఈ సినిమాలో తనొక 60 ఏళ్ల
వయసు గల వ్యక్తి పాత్రలో చాలా వయిలంట్ గా కనిపిస్తానని జగపతి బాబు అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates