HomeTelugu Trendingజాన్వీతో కృష్ణవంశీ సినిమా!

జాన్వీతో కృష్ణవంశీ సినిమా!

Jahnvi kapoor in Krishna Va
టాలీవుడ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో ఆయన ఓ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ని ఎంపిక చేయనున్నానారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఓ కథను సిద్ధం చేసుకున్నారట, దానికి సంబంధించిన స్ర్కిప్టు కూడా సిద్ధమైందని సమాచారం.

జాన్వీ కపూర్‌ నటించిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ చూసిన తరువాత కృష్ణవంశీ రాసుకున్న కథకు జాన్వీ అయితేనే సరిపోతుందని భావించారట. ఇప్పటికే జాన్వీ తండ్రి బోనీకపూర్‌తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తుంది. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నారట. ప్రస్తుతం ఆయన ‘రంగ మార్తాండ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జాన్వీ ‘గుడ్‌ లక్‌ జెర్రీ’, ‘రూహి’, ‘దోస్తానా2’లాంటి చిత్రాలతో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu