HomeTelugu Big Stories‘భోళా శంకర్‌’ గా చిరంజీవి

‘భోళా శంకర్‌’ గా చిరంజీవి

Untitled 1 2
మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా మెగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ టైటిల్‌ను ప్రకటించారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి ‘భోళా శంకర్‌’ అనే పేరును ఫిక్స్‌ చేశారు. చిరంజీవి 66వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆదివారం ఉదయం చిత్రబృందం ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు.. ఈ మూవీ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసి చిరుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కోలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ఈ సినిమా రానుంది. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో గుండుతో కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించే ఈ చిత్రంలో చిరుకి సోదరిగా కీర్తి సురేశ్‌ కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu