టాలీవుడ్‌ హీరోలపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు..


పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హీరో నుండి.. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు గా మారాడు. మొన్నటి వరకు హీరోగా రికార్డులు తిరగరాసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు జనసేన పనులతో బిజీ అయిపోయాడు. పార్టీ ఓడినా.. తాను ఓడిపోయినా కూడా జనాల మధ్యే కనిపిస్తున్నాడు. కొన్ని రోజులుగా రోజూ వార్తల్లోనూ ఉంటున్నాడు పవన్. తెలుగు భాషను కాపాడండంటూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాడు పవన్‌. మన భాషను కాపాడుకుందాం.. ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా తెలుగును బతికించుకుందామంటూ గళమెత్తుతున్నాడు.

పవన్ వ్యాఖ్యలతో కొందరు ఏకీభవిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి తెలుగు ఇండస్ట్రీపై కూడా తన ఫోకస్ పెట్టాడు ఈ జనసేనాని. ఇప్పటి వరకు ఇండస్ట్రీని ఒక్క మాట కూడా అనని ఈయన.. ఇప్పుడు ఏకంగా హీరోలపైనే పడ్డాడు. సంచలన వ్యాఖ్యలు చేసాడు.. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదని.. అది నేర్చుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా అంటూ విమర్శంచారు పవన్ కళ్యాణ్.

కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్‌లో తెలుగు దిగజారిపోతుందని.. దాన్ని బతికించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలతో పాటు నటులపై కూడా ఉందని గుర్తించుకోవాలంటున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సెటైర్లు కూడా పేలుతున్నాయి. అప్పట్లో తన ప్రతీ సినిమాలో కూడా ఇంగ్లీష్, హిందీ పాటలను పెట్టాడు పవర్ స్టార్. మరి అప్పుడు తెలుగు గురించి ఏం తెలియలేదా అంటూ జనసేనానిపై పంచులు పడుతున్నాయి. మొత్తానికి పవన్ తెలుగు ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్‌కు ఇక్కడ్నుంచి ఎవరొచ్చి సమాధానం చెప్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.