అభిమానుల్లో ఆశలు రేపుతున్న పవర్ స్టార్‌ న్యూలుక్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌ తన పూర్తి దృష్టిని రాజకీయాలపైనే కేటాయించాడు. సినిమాలకు దూరంగా ఉన్నా.. రాజకీయాల్లో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సూపర్ స్టారే. ఆయన కనిపిస్తే వచ్చే కేరింతలు, పవర్‌ వేరు. ఇక ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన ఘోర ఓటమితో పాటు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడాన్ని మాత్రం ఆయన అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా.. వచ్చే ఎన్నికల నాటికీ ఏపీలో పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి సారిస్తున్నట్టు ప్రకటించారు పవన్ కళ్యాణ్. అంతేకాదు జనసేన పార్టీని మండల, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాదు ఎన్నికల తర్వాత తాను సినిమాల్లో నటించబోతున్నట్టు వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. తనకు సినిమాలు కాదు.. రాజకీయాలే ముఖ్యమని పలు సందర్భాల్లో ప్రకటిస్తూనే ఉన్నారు. ఐనా.. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాత్రం ఆయన మళ్లీ సినిమాలు చేస్తే చూడాలనే ఆసక్తితో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల వైపు తొంగి చూసేదే లేదంటూ తేల్చేపారేసాడు.

ఇక ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ గడ్డంతో..తెల్లని లాల్చీ, పైజామా ధరించి పూర్తిస్థాయి రాజకీయనేతగా మారిపోయారు. కానీ తాజాగా తానా సభలకు వెళ్లే సందర్భంగా పవన్ లుక్‌ను చూసిన అభిమానులు మాత్రం ఆయన హీరోగా నటిస్తే చూడాలనే కోరికతో ఉన్నారు. ట్రిమ్ చేసిన గడ్డం, టీ షర్టు, జీన్స్ ప్యాంటులో పవన్ కళ్యాణ్ గెటప్ చూసిన వారు కెవ్వు కేక అంటున్నారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు మాత్రం.. పవన్ కళ్యాణ్ మాత్రం నిర్మాతగా చిత్రలు తెరకెక్కిస్తుంటాడని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా నిర్మించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ నటన పరంగా దూరమైనా..నిర్మాతగా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాడట .