HomeTelugu Newsజనసేన 'మన నుడి-మన నది'

జనసేన ‘మన నుడి-మన నది’

8 17

జనసేన ఆధ్వర్యంలో ‘మన నుడి-మన నది’ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆపార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ”మన భవితకు ప్రాణధారమైన మాతృభాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతాం. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరం. మాతృభాష, నదులను పరిరక్షించుకొనే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నాగరికతకు పుట్టినిల్లు నది. నది లేనిదే సంస్కృతి లేదు. నది నశించాక ఆ సంస్కృతి మిగలదు. నాగరికతకు అమ్మ ఒడి నుడి. భాష లేనిదే సంస్కృతి లేదు. మాతృభాష గతించాక సంస్కృతి మిగలదు. మన నుడిని, నదిని కాపాడుకోవాలి. అందుకే విజ్ఞులు, మేధావులతో ఈ అంశంపై చర్చించాం. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని భాగస్వాముల్ని చేసేలా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం” అని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu