HomeTelugu Trendingబుట్టబొమ్మగా 'జాన్వీ'

బుట్టబొమ్మగా ‘జాన్వీ’

Janhvi kapoor in ala vaiku

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సిఇనమా హిందీలో రీమేక్‌ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు హిట్‌ ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్‌ వార్దే ‘అల.. వైకుంఠపురములో..’ హిందీ రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నారని సమాచారం. భారీ అంచనాల మధ్య రూపొందబోతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది, మరికొన్ని రోజుల్లో ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కాగా ఈ సినిమాలో పూజా చేసిన పాత్రను హిందీ లో ‘జాన్వీ కపూర్’ చేస్తుందంట. జాన్వీ కపూర్ త్వరలో ‘గుంజన్ సక్సెనా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో పాటు మరో సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇదే సమయంలో ఈమెకు ‘అల వైకుంఠపురంలో’ రీమేక్ లోనూ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!